మాస్కో: రష్యా మరియు ఉక్రెయిన్‌ల మధ్య పరిస్థితులు తీవ్ర రూపం దాల్చినా అవి యుద్ధం వరకు పోవని అందరూ ఊహించారు. కానీ రష్యా అధ్యక్షుడు మాత్రం ఉక్రెయిన్ విషయంలో తాము తగ్గేది లేదంటూ ఏకంగా ఉరెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నట్లు ప్రకటించి యావత్ ప్రపంచ దేశాలు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దన్నట్లు గట్టి సంకేతాలే పంపారు.
గత కొద్ది కాలంగా చర్చలు జరపడానికి సిద్ధమని చెప్పుకొచ్చిన రష్యా ఉన్నపలంగా మిలిటరీ ఆపరేషన్ ని చేపట్టింది. ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఉక్రెయిన్‌ను మరియు మాజీ సోవియట్ దేశాలను నాటోలో చేర్చకూడదు అన్నది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క ప్రధాన డిమాండ్.
కాగా రష్యా యొక్క డిమాండ్‌ని అమెరికా, నాటో మాత్రం అంగీకరించలేదు. గతంలో ఉక్రెయిన్ దేశం రష్యా నుంచి విడిపోయింది. ప్రస్తుతం ఉక్రెయిన్ నాటోలో చేర్చుకుని పశ్చిమ దేశాలు రష్యాను చుట్టుముట్టేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని రష్యా వాదిస్తోంది. ఉక్రెయిన్‌ని నాటోలో చేర్చడం వల్ల రష్యా భద్రతకు పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదముందని పుతిన్ వాదన.