మూవీడెస్క్: దర్శకుడు అజయ్ భూపతి, ‘ఆర్ ఎక్స్ 100’, ‘మహా సముద్రం’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా ‘మంగళవారం’ సీక్వెల్‌ను ప్రకటించినప్పటికీ, చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్‌తో మరో పాన్ ఇండియా సినిమా చేయాలని అనుకున్నాడు.
కథ చెప్పగానే ధృవ్ ఒప్పుకున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని సమాచారం అందుతోంది.
ఈ మూవీ కోసం చాలాసార్లు చర్చలు జరిగినప్పటికీ, చివరికి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదని తెలుస్తోంది.
ధృవ్ ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడనేది స్పష్టంగా తెలియనప్పటికీ, అజయ్ భూపతి ఇప్పుడు మరో హీరో కోసం వెతుకుతున్నారు.
ఒకవేళ ఎవరు సెట్ కాకపోతే ‘మంగళవారం’ సీక్వెల్‌ని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే, అజయ్ భూపతి సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
కానీ, ఆయన ప్రతి సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
మరోవైపు, ధృవ్ విక్రమ్ ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘బిసన్’ అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు, ఇందులో అనుపమ పరమేశ్వరన్ కూడా హీరోయిన్‌గా కనిపించనుంది.