టాలీవుడ్: రీజనల్ సినిమా డైరెక్టర్ లు నేషనల్ లెవెల్ బాలీవుడ్ మూవీస్ కి వెళ్లడం చాలా తక్కువగా జరుగుతుంది. అలంటి వాళ్లలో ముందుగా వినిపించే పేరు రామ్ గోపాల్ వర్మ. తెలుగు లో సినిమా ప్రయాణం ప్రారంభించి బాలీవుడ్ వెళ్లి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి అక్కడి టాప్ హీరోలతో కూడా హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత అంతగా పేరు తెచ్చుకున్న వాళ్ళు లేరు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత టాలీవుడ్ నుండి డైరెక్టర్ లు బాలీవుడ్ వెళ్లి అక్కడా హిట్స్ కొడుతున్నారు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ ‘సందీప్ రెడ్డి వంగ’ బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో ‘కబీర్ సింగ్’ సినిమా తో సూపర్ హిట్ సాధించి తరువాత రన్బీర్ కపూర్ తో ‘ఆనిమల్’ అనే సినిమా తీయబోతున్నాడు. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా ‘జెర్సీ’ సినిమాని షాహిద్ కపూర్ తో రీమేక్ చెయ్యబోతున్నాడు.
ఈ లిస్ట్ లో ఇపుడు మరో డైరెక్టర్ కూడా జత కాబోతున్నాడు. శర్వానంద్ తో ‘రన్ రాజా రన్’ సినిమా తో ఇండస్ట్రీ లోకి డైరెక్టర్ గా వచ్చి రెండవ సినిమానే ప్రభాస్ తో ‘సాహో’ సినిమా తీసాడు సుజీత్. ఇక్కడ అంతగా ఆడకపోయినా కానీ బాలీవుడ్ లో సుపుర్హిట్ గా నిలిచింది. రెండవ సినిమానే అంత పెద్ద ప్రాజెక్ట్ ని చిన్న చిన్న మిస్టేక్స్ అయిన కూడా బాగానే హ్యాండిల్ చేసాడు. ఒక రకంగా ఇదొక ఇంటెలిజెంట్ మూవీ కొంచెం జనాలకి రీచ్ అవడం లో టైం పట్టడంతో సినిమా బెడిసికొట్టింది అని చెప్పవచ్చు. సాహో సినిమా తర్వాత ఇప్పటివరకు సినిమా ప్రకటించని సుజీత్ జీ స్టూడియోస్ తో డైరెక్షన్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంతవరకు సినిమా గురించి మిగతా వివరాలు ప్రకటించలేదు కానీ డైరెక్టర్ తమ ప్రొడక్షన్ హౌస్ లో సినిమా తియ్యబోతున్నట్టు జీ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది.