విరుపాక్ష వంటి విభిన్న సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు మళ్లీ మరో ఎమోషనల్ కంటెంట్‌కు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’ (SYG) చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో కనిపించనున్న తేజ్, ఆ తర్వాత పూర్తిగా ప్రేమ నేపథ్యంలో ఓ కథను ఎంచుకున్నట్టు సమాచారం.
ఇది మామూలు ప్రేమకథ కాదని, ఇందులో ఉన్న ఎమోషనల్ షేడ్స్, కథాకథన శైలీ ప్రత్యేకంగా ఉండనున్నాయని ఫిలింనగర్ టాక్.
ఈ కథను తమిళ దర్శకుడు రాసి, గత రెండేళ్లుగా డెవలప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కథ వినగానే తేజ్ వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. స్క్రీన్‌ప్లే స్ట్రాంగ్‌గా ఉండటంతో, తేజ్ ఈ ప్రాజెక్ట్‌కి పర్సనల్‌గా ఆసక్తి చూపుతున్నాడట.
ప్రస్తుతం ఈ సినిమాకు “ఇది మామూలు ప్రేమ కాదు” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ టైటిల్ వినగానే ఓ ప్రత్యేకత కనిపిస్తోంది. ప్రేమలో వచ్చే భిన్న స్థాయిల భావోద్వేగాలను తేజ్ పాత్ర బలంగా ప్రదర్శించనున్నట్టు చెబుతున్నారు.
ఇది ఆయనకు ఓ కొత్త కోణాన్ని తీసుకొచ్చే సినిమా అవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం SYG పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, ఈ కొత్త సినిమా స్క్రిప్ట్ వర్క్ ముగింపు దశలో ఉందట.