fbpx
Wednesday, October 23, 2024
HomeMovie Newsసాయి పల్లవి ఉన్నా సందడి లేదేంటి?

సాయి పల్లవి ఉన్నా సందడి లేదేంటి?

SAI-PALLAVI-IN-SIVA-KARTHIKEYA-MOVIE
SAI-PALLAVI-IN-SIVA-KARTHIKEYA-MOVIE

మూవీడెస్క్: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ కలిసి నటించిన ‘అమరన్’ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

అక్టోబర్ 31న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

భారత ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా, సాయి పల్లవి ఆయన భార్యగా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నా, టాలీవుడ్ వెర్షన్ పై ప్రమోషన్లు తగ్గినట్లు కనిపిస్తోంది.

సాయి పల్లవి తెలుగులో క్రేజీ హీరోయిన్ అయినప్పటికీ, ఆమె ఫాలోయింగ్ ను కేవలం గ్లింప్స్ విడుదల చేసి వదిలేశారు.

మిగతా ప్రమోషన్ల విషయంలో మేకర్స్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. తెలుగు ట్రైలర్ అక్టోబర్ 23న సాయంత్రం ఆరు గంటలకు విడుదల కానుంది.

ఈ సందర్భంగా టీమ్ మరిన్ని ప్రమోషన్లకు ముందుకు వస్తుందా? లేదా అన్నది వేచి చూడాలి.

శివ కార్తికేయన్ నటించిన ఈ ప్రాజెక్ట్ తెలుగు మార్కెట్ లో ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular