ప్రస్తుతం అందాల తార సాయి పల్లవి చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటోంది. ఈ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘రామాయణం’ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో ఆమె పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది.
ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఓ లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో సాయి పల్లవి లీడ్ రోల్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కథకు అవసరమైన అన్ని అంశాలు పక్కాగా సిద్ధం చేశారని తెలుస్తోంది. సాయి పల్లవి అద్భుతమైన నటనా ప్రతిభ ఉన్న నటిగా గుర్తింపు పొందింది. ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తే, అది మంచి మైలురాయిగా మారే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మైత్రి బ్యానర్‌పై వస్తున్న ప్రాజెక్ట్ కావడం ఇంకొక ప్లస్.
ప్రస్తుతం అధికారికంగా ఈ వార్తపై ప్రకటన రాలేదు. సాయి పల్లవి ఈ సినిమాలో నిజంగా నటిస్తుందా? లేదంటే మరెవరైనా ఎంపికవుతారా? అనే క్లారిటీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఫుల్ డీటెయిల్స్ రానున్నాయి.