మూవీడెస్క్: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న సాయిపల్లవి తాజాగా సహాయ దర్శకుల పరిస్థితుల గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
ఫిల్మ్ సెట్స్ పై తమ వంతు కష్టపడే వారికి తగినంత రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం బాధ కలిగిస్తోందని సాయి పల్లవి అన్నారు.
సహాయ దర్శకుల కష్టం తగిన గుర్తింపుతో పాటు తగిన పారితోషకం కూడా పొందాలని ఆమె అభిప్రాయపడ్డారు.
తన వ్యాఖ్యల్లో, బాలీవుడ్ పరిశ్రమలో సహాయ దర్శకులకు మెరుగైన వేతనాలు ఉంటాయని, కానీ సౌత్ ఇండస్ట్రీలో పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు.
మన దగ్గర వారు అంతగా గుర్తింపు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి కృషికి తగిన విలువ ఇవ్వాలని ఉంది” అని సాయిపల్లవి పేర్కొన్నారు.
సాయిపల్లవి మాటలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
కమర్షియల్ సినిమాలు, పెద్ద పారితోషకాలకంటే కష్టపడి పని చేసే వారి సంక్షేమంపై దృష్టి పెట్టడం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది.
ప్రస్తుతం సాయిపల్లవి ‘అమరన్’లో నటనతో మెప్పించగా, త్వరలో ‘తండేల్‘ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.