విజయవాడ: తమకి తోచిన దాన్లో ఇతరులకి సహాయం చేసేవాళ్ళు చాల తక్కువమంది ఉంటారు. అలాంటి అలవాట్లు మన హీరోల్లో కొందరికి ఎక్కువగానే ఉంటుంది. మెగాహీరోల్లో పవన్ కళ్యాణ్ సామజిక సేవ కార్యక్రమాల్లో ముందుంటాడు. పవన్ కళ్యాణ్ ని ఇన్స్పిరేషన్ గా చేసుకుని నెక్స్ట్ జెనెరేషన్ మెగా హీరోలు కూడా తమకి వీలు చిక్కినప్పుడల్లా చారిటీ పనులు చేస్తూ పోతుంటారు. ఆలా 2019లో తన బర్త్ డే సందర్భంగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశాడు.విజయవాడలోని ఓ వృద్ధాశ్రమం నిర్వాహకులు తనను సోషల్ మీడియా ద్వారా సంప్రదించారని.. అసంపూర్తిగా ఉన్న తమ బిల్డింగ్ నిర్మాణానికి సహాయం చేయాల్సిందిగా కోరారని తెలిపాడు. దాని నిర్మాణ బాధ్యత తీసుకున్నానని.. మెగా ఫ్యాన్స్ కూడా తన బర్త్ డే కి పెట్టే ఖర్చుని ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి ఇవ్వమని విజ్ఞప్తి చేశాడు.
సాయి ధరమ్ తేజ్ ఏడాది క్రితం తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు.’అమ్మ ప్రేమ ఆదరణ సేవ’ వృద్ధాశ్రమ నిర్మాణాన్ని తేజ్ తన టీమ్ ద్వారా పూర్తి చేసాడు. సాయి ధరమ్ తేజ్ పిలుపు మేరకు మెగా ఫ్యాన్స్ కూడా లక్ష రూపాయల సహాయం చేశారని తెలుస్తోంది. ‘అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ’ ఓల్డేజ్ హోమ్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఇపుడు బయటకు వచ్చాయి. అంతేకాకుండా ఇపుడు పూర్తి కాబడిన ఈ వృద్ధాశ్రమానికి ఒక సంవత్సరం పాటు ఆర్ధికంగా అండగా నిలుస్తానని తేజ్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం వారికి అండగా నిలబడినందుకు మెగా మేనల్లుడికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.