టాలీవుడ్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాని కరోనా తర్వాత రిస్క్ చేసి మొదట విడుదల చేసి తర్వాత రాబోతున్న చాలా సినిమాలకి దారి చూపి మార్గ దర్శకం గా నిలిచాడు. ఈ హీరో తన తదుపరి సినిమాగా ‘రిపబ్లిక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది సినిమా టీం.
ప్రస్థానం, ఆటో నగర్ సూర్య లాంటి హై ఇంటెన్సిటీ సినిమాలని రూపొందించిన దేవా కట్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఒక పొలిటికల్ డ్రామా గా రూపొందనున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ లో ‘డెబ్భై నాలుగు ఏళ్లుగా మనం ప్రభుత్వం ఉందనే భ్రమలో బ్రతుకుతున్నాం కానీ మనకి ఇంకా ప్రభుత్వం అనేది ఎలా ఉంటుందో తెలియదు ‘ అనే డైలాగ్ తో సినిమా ఎలా ఉండబోతుందో ఒక హింట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ లుక్ లో గాగుల్స్ పెట్టుకున్న సాయిధరమ్ తేజ్ స్కెచ్ ఆర్ట్ ఒకటి పెట్టి గాగుల్స్ లో రెండు గ్యాంగ్స్ మధ్యన జరుగుతున్న ఒక డిస్కషన్ లాంటిది చూస్తున్నట్టు చూపించారు.
జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ , జె.పుల్లారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడీ గా మరో కీలకమైన పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. శాసన కార్య నిర్వాహక మరియు న్యాయవ్యవస్థ కలసి సక్రమంగా పని చేయడమే అసలైన రిపబ్లిక్ అంటూ టీజర్ లో స్ట్రాంగ్ అండ్ ఇంటెన్స్ కథ, కథనం ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చిన దేవా కట్ట జూన్ 4 న విడుదలవుతున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ మరిన్ని హిట్ సినిమాలని తియ్యాలని ఆశిద్దాం.