టాలీవుడ్: సాయి ధరమ్ తేజ్, నభ నటేష్ జంటగా నటించిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. గత కొంత కాలంగా అపుడో ఇపుడో విడుదలవుతుంది అని దొబూచులాడిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ లో ఓటీటీ లో విడుదల అవుతుంది. ఈ సినిమాని జీ 5 ఓటీటీ లో విడుదల చేయనున్నట్టు ఇవాళ అధికారిక ప్రకటన వెలువడింది. మొదట్లో హ్యాట్రిక్ హిట్లు కొట్టి ఆ తర్వాత వరుస ప్లాప్ లతో డీలాపడిన హీరో సాయి ధరమ్ తేజ్ మళ్ళీ చిత్రలహరి, ప్రతి రోజు పండగే లాంటి సినిమాలతో హిట్ లు కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందనే ఆశతోనే ఉన్నాడు కానీ కరోనా వల్ల థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనపడకపోవడం తో చివరకి ఓటీటీ లో విడుదల చేస్తున్నారు.
ఎస్వీసిసి బ్యానర్ పై బివీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సుబ్బు అనే నూతన దర్శకుడి నేతృత్వం లో ఈ సినిమా రూపొందింది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ సినిమానుండి విడుదలైన పాటలు ఇప్పటికే హిట్ గా నిలిచాయి. ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇది ఒక రెగ్యులర్ రోమ్ కామ్ సినిమా కాదు ఒక కొత్త రకమైన ఎంటర్ టైనర్ అని చాలా ట్విస్టులు ఉన్నాయని జీ స్టూడియోస్ ట్వీట్ చేసి ఈ సినిమాని వారి ఓటీటీ లో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఇది డైరెక్ట్ సబ్స్క్రిప్షన్ లేదా పే పర్ వ్యూ పద్ధతి లో విడుదల చేస్తున్నారా అనే విషయం పై మాత్రం ఏ ప్రకటనా చేయలేదు.