టాలీవుడ్: సుప్రీమ్ హీరో ‘సాయి ధరమ్ తేజ్’ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఎపుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వల్ల ఇన్ని రోజులు ఆలస్యం అయింది. కరోనా తర్వాత థియేటర్ లలో విడుదల అవుతున్న కొంచెం గుర్తింపు ఉన్న తెలుగు సినిమా కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 25 న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ కూడా నిన్న విడుదల చేసారు. ‘బోలో బోలో బాచిలర్ – సోలో బ్రతుకే సో బెటర్ ‘ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది.
సింగిల్స్ అందరికి ఈ పాట అంకితం అంటూ సాయి ధరమ్ తేజ్ ఈ పాటని విడుదల చేసాడు. ఈ పాట మొత్తం వైజాగ్ గీతమ్ కాలేజ్ లో షూటింగ్ చేసారు. ఈ పాట గీతమ్ కాలేజ్ మరియు వైజాగ్ వాల్లకి మంచి మెమోరీస్ ని గుర్తు చేస్తుంది అని కూడా ట్వీట్ చేసారు. విడుదలైన పాట సంగీతం తో పాటు సాహిత్యం కూడా ఆకట్టుకుంది. సింపుల్ వర్డ్స్ తో మంచి అర్థవంతంగా పాటని రాయడంలో
సీతారామ శాస్త్రి సిద్దహస్తుడని మరోసారి నిరూపించుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పైన బి వీ ఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సుబ్బు అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. కరోనా తర్వాత థియేటర్ ల లోకి వచ్చి మాత్రమే ఈ సినిమాని ఎంజాయ్ చేయండి అని సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా ఫలితం ఆధారంగానే మిగతా సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాయి.