హైదరాబాద్: ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టాలీవుడ్ సినీ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మెరుగుపడిందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్ కూడా తొలగించేసినట్లు వైద్యబృందం సోమవారం తెలిపింది.
ఆయనను మూడు రోజుల కిందటే ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారని చెప్పాయి ఆసుపత్రి వర్గాలు. ఇప్పుడు సాయిధరం తేజ్ స్వంతంగానే శ్వాస తీసుకుంటున్నరు, అందరితో బాగా మాట్లాడగలుగుతున్నారని కూడా తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆయన మరో రెండు, మూడు రోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయబోతున్నట్లు తెలిపింది. ఈనెల 10న దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి వెళ్తూ బైక్ స్కిడ్ అయి సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి విదితమే.