మూవీడెస్క్: దర్శకుడు దేవ్ కట్టా పొలిటికల్ జానర్ ‘రిపబ్లిక్’ని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో మెగా మేనల్లుడు సాయితేజ్ జిల్లా కలెక్టర్‌గా కనిపించబోతుండడం వల్ల్ల ‘రిపబ్లిక్’ మూవీ పై మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదివరకే విడుదలైన ఈ మూవీ పాటలు మరియు ట్రైలర్ ఇంకా భారీ అంచనాలను పెంచాయి. కోవిడ్ పరిస్థితుల వల్ల పలుమార్లు వాయిదా పడ్డ రిపబ్లిక్ అక్టోబర్ 1వ తేదీన థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ రిపబ్లిక్ మూవీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది? కలెక్టర్‌గా సాయితేజ్ మెప్పించాడా?లేదా? రివ్యూలో చూద్దాం.
కథ నేపథ్యం ఏంటంటే 1970లో స్వచ్ఛమైన తెల్లేరు సరస్సును రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులచే కబ్జాకు గురవుతుంది. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఆ సరస్సులో విషపు ఆహారాన్ని వేస్తూ చేపలను పెంచుతారు. దాని కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. అయినప్పటికీ ఆంధ్ర ప్రజా పార్టీ అధినేత్రి విశాఖవాణి(రమ్యకృష్ణ) తన వ్యాపారాన్ని వదులుకోదు.
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయంగా ఎదుగుతూ తన కొడుకుని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుంది. ఆ ప్రాంతానికి కలెక్టర్‌గా వచ్చిన పంజా అభిరామ్ (సాయి తేజ్) సరస్సు ఆక్రమించినవారిపై చర్యలు తీసుకుంటాడు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విశాఖవాణితో వైర్యం పెరుగుతోంది. ఇది ఎంతవరకు దారి తీసింది? నిజాయతీపరుడైన కలెక్టర్ అభిరామ్, అవినీతి నాయకురాలైన విశాఖ వాణికి ఎలా బుద్ది చెప్పాడు? అనేదే ‘రిపబ్లిక్’ కథ.
ఈ చిత్రం కోసం సాయితేజ్ తన ప్రాణంపెట్టి నటించాడు. అవినీతి పరుడైన తండ్రిని కాదని తన కాళ్లమీద తాను నిలబడే వ్యక్తిగా, నిజాయతీ గల కలెక్టర్ అభిరామ్ పాత్రలో సాయి తేజ్ అదరగొట్టేశాడు. ప్రాంతీయపార్టీ అధినేత్రిగా రమ్యకృష్ణ తనదైన నటనతో మెప్పించింది. ఇక అవినీతికి పాల్పడే గ్రూప్ 1 అధికారి దశరథ్ పాత్రలో జగపతిబాబు ఎప్పటిమాదిరే పరకాయప్రవేశం చేశాడు. అద్భుత పర్‌ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.
ఇక తప్పిపోయిన అన్నయ్యను వెత్తుకుంటూ అమెరికా నుంచి ఇండియా వచ్చిన యువతి మైరా(ఐశ్వర్య రాజేశ్) తన పాత్రకు న్యాయం చేసింది. అవినీతి ఎస్పీగా శ్రీకాంత్ అయ్యంగార్, కలెక్టర్‌గా సుబ్బరాజ్, జగపతిబాబు భార్యగా ఆమని, తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఈ మూవి యొక్క పాజిటివ్ పాయింట్స్:
కథ, సాయితేజ్, జగపతి బాబు మరియు రమ్యకృష్ణల నటన, సినిమా డైలాగ్స్, మరియు క్లైమాక్స్.
చిత్రం లోని మైనస్ పాయింట్స్:
చిత్రంలో పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, కథ అంతా సరస్సు చుట్టూనే తిరగడం, నిదానంగా సాగే సన్నివేశాలు.