టాలీవుడ్: సినిమా అంటే ప్యాషన్, పిచ్చి ఉండే వాళ్ళ అల్ టైం తెలుగు ఫెవరెట్ సినిమాల్లో ‘ప్రస్థానం’ సినిమా ఉంటుంది అనడం అతిశయోక్తి కాదు. అలాంటి సినిమాని డైరెక్ట్ చేసిన ‘దేవా కట్ట‘ గత కొన్ని సంవత్సరాలుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘ప్రస్తానం’ తర్వాత నాగ చైతన్య తో ‘ఆటో నగర్ సూర్య’ సినిమా రూపొందించినప్పటికీ అనేక వాణిజ్య పరమైన కారణాల వలన ఆ సినిమా అసంపూర్తి అనే ఫీలింగ్ కలుగుతుంది. లేకుంటే ఈ సినిమా కూడా ప్రస్తానం రేంజ్ దాటి పోయే సినిమా అయ్యేది. ప్రస్తుతం దేవా కట్ట మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ‘రిపబ్లిక్’ అనే సినిమా రూపొందించాడు. ఈ సినిమా రిలీజ్ అప్ డేట్ ఈ రోజు విడుదల చేసారు.
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఒక కలెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఒక పొలిటికల్ డ్రామా గా రూపొందింది. పంజా అభిరామ్ అనే పాత్రలో వ్యవస్థ లో ఉన్న లోటు పాటలని సెట్ చేస్తూ తప్పుని ఎత్తి చూపే పాత్రలో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి తేజ్ కి జోడీ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. JB ఎంటెర్టైన్మెట్న్స్ బ్యానర్ పై J భగవాన్ , J పుల్లారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మణి శర్మ సంగీతం లో ఈ సినిమా రూపొందింది. అక్టోబర్ 1 న థియేటర్లలో ఈ సినిమా విడుదలవనుంది. ఈ సినిమా తో బ్లాక్ బస్టర్ సాధించి దేవా కట్ట తనకి తగిన గుర్తింపు అందుకుంటాడని ఆశిద్దాం.