టాలీవుడ్: ‘నీ సంకల్పం కన్నా గొప్పది ఏదీ లేదు’, ‘ప్రయత్నించకుండా ఓడిపోతే నీ తప్పుంది, కానీ చివరి వారికి ప్రయత్నించి ఓడిపోతే నీ తప్పమి లేదు, నీ ప్రయత్నం లోనే నీ గెలుపుంది ‘. ఇలా కొన్ని సినిమాల్లో విన్నాం. ఇంచుమించు ఇలాంటి అర్ధం వచ్చేట్టు ఒక వీడియో షేర్ చేసాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఆ వీడియో లో ఒక చిన్న పురుగు ఒక బల్ల మీది నుండి మరో బల్ల మీదికి వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఆశ్చర్య పరుస్తుంది. చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ లాగా కూడా అనిపిస్తుంది. ఒక బల్ల పై నుంచి ఇంకో బల్ల పైకి పాకే క్రమంలో అసలు దానికి అసాధ్యం అనుకుంటే దానిని సాధ్యం చేసి చూపించింది ఆ చిన్న పురుగు.
ఇంచు మించు ఇదే కాన్సెప్ట్ తో సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ అనే సినిమా ద్వారా విజయాల బాట పట్టాడు. సాయి ధరమ్ తేజ్ సినిమా ప్రయత్నాలు కూడా ఇలానే ఉన్నాయి మొదట్లో. చాలా కష్టపడి ఒక సినిమాలో అవకాశం దక్కించుకొని ఆ సినిమా షూటింగ్ అయిపోయాక చాలా కారణాల వలన సినిమా విడుదల అవక దాదాపు మూడు సంవత్సరాలు ఎదురుచూశాడు ఈ హీరో. సరిగ్గా చూడాలే కానీ ఒక్కో మనిషిని కదిలిస్తే ఒక్కో కథ దొరుకుతుంది. వాల్లు విజయం సాధించే క్రమంలో ఎదుర్కొన్న కష్టాలు, అధిగమించిన అవరోధాలు మిగతా వాళ్ళకి స్ఫూర్తి గా నిలుస్తాయి. సక్సెస్ కోసం షార్ట్ కట్ లు వెతుక్కునే రోజుల్లో కష్టే ఫలి, నీ కష్టాన్ని సంకల్పాన్ని నమ్ముకుంటే నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అని చెప్పే ఈ వీడియో చాలా మందికి కనువిప్పు కలిగిస్తుందని ఆశిస్తున్నాం.