ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన దుండగుడు రూ.1 కోటి డిమాండ్ చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముంబై పోలీసులు ఈ ఘటనను దొంగతనం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గురువారం తెల్లవారుజామున సైఫ్ నివాసంలోకి జొరబడ్డ దుండగుడు, కత్తి, కర్రను ఉపయోగించి కుటుంబాన్ని బెదిరించినట్టు పోలీసులు తెలిపారు.
సైఫ్ కుమారుడు జెహ్ గదిలోకి ప్రవేశించి డబ్బు డిమాండ్ చేయగా, సైఫ్ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగుడు కత్తితో దాడి చేశాడు.
సైఫ్ వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించగా, వెన్నెముకలో గుచ్చుకున్న కత్తి మొన తొలగించేందుకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు.
సైఫ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ దాడి నేపథ్యంలో నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు.