హైదరాబాద్: జీవితం లో కొన్ని కష్టాలు పడి సక్సెస్ సాధించిన తర్వాత తమ లాగే కష్టాలు పడే వారికి అవకాశాలు కల్పించే వాల్లు చాలా తక్కువ. అలాంటి వాళ్లలో శైలేష్ కొలను ఒకరు. శైలేష్ కొలను అనే పేరు చెప్తే గుర్తు పట్టకపోవచ్చు కానీ కరోనా సంక్షోభానికి కొంచెం ముందు ‘విశ్వక్సేన్’ తో ‘హిట్’ అనే క్రైమ్ థ్రిల్లర్ తీసి హిట్ సాధించిన దర్శకుడు అంటే చాలా మంది గుర్తుపడతారు.
ప్రస్తుతం ఈ దర్శకుడు కొత్త అవకాశాలు క్రియేట్ చేసే పనిలో పడ్డాడు. మొన్నటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కోసం ఆడిషన్స్ నిర్వహించి అందులో కొందరిని సెలెక్ట్ చేసుకొని తాను తీయబోయే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం కొత్త నటుల వేటలో పడ్డాడు. అన్ని రకాల వయసు వాళ్ళకి ఈ అవకాశం అని చెప్పారు. తమ యాక్టింగ్ కి సంబంధించి ఒక షో రీల్ లేదా వీడియో చేసి ఆ వీడియో ని తనకి ఇమెయిల్ చెయ్యాలని చెప్పాడు. తానే స్వయంగా ఆ వీడియోలు అన్నీ చూసి అందులోంచి సెలెక్ట్ చేసుకోనున్నట్టు చెప్పారు. ఈ కరోనా పరిస్థితుల వల్ల ఇలా ఆన్లైన్ ఆడిషన్స్ నిర్వహించాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఇలా తనకి పంపించిన వాటిల్లోంచి తనకి నచ్చినవే సెలెక్ట్ చేసి తర్వాత కాంటాక్ట్ చేయబోతున్నట్టు చెప్పారు. ఇంతకీ తాను తియ్యబోయే హిందీ హిట్ రీమేక్ సినిమా కోసమా లేదా వేరే ఏదైనా సినిమా కోసం ఆడిషన్స్ చేస్తున్నారా అనే విషయం అయితే ఈ డైరెక్టర్ చెప్పలేదు.
ఏదైనా ఇలా తమకి అంది వచ్చిన అవకాశాన్ని వాడుకొని ఒక స్టేజి కి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం కొంచెం సమయం వెచ్చించాల్సి వచ్చినా కూడా తన తో పాటు చాలా మందిని ఎదిగే అవకాశం ఇవ్వడం అనేది మంచి పరిణామం.