fbpx
Sunday, January 19, 2025
HomeMovie News'సైనా' బయోపిక్ ఫస్ట్ గ్లిమ్ప్స్

‘సైనా’ బయోపిక్ ఫస్ట్ గ్లిమ్ప్స్

SainaNehwalBiopic Saina FirstGlimpseReleased

బాలీవుడ్: గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా కొనసాగుతుంది. ప్రస్తుతం మరో క్రీడాకారిణి బయోపిక్ రూపొందుతుంది. ఒలింపిక్ మెడల్ విన్నర్, బాడ్మింటన్ నేషనల్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవిత కథని ‘సైనా’ పేరుతో బయోపిక్ రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేసారు. హైదరాబాద్ కి చెందిన సైనా నెహ్వాల్ ఒలింపిక్ మెడల్ విన్నర్ గా ఎలా అవతరించింది అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. మామూలుగా క్రీడాకారుల బయోపిక్ లు అంటే వాళ్ళు సాధించిన విజయాలు చూపించడం కాకుండా ఆ విజయాల్ని పొందడానికి వాళ్ళు పడిన కృషి చూపించడం లోనే ఆ సినిమా విజయం ఆధారపడుతుంది.

ఈ సినిమాలో టైటిల్ రోల్ లో పరిణీతి చోప్రా నటిస్తుంది. సైనా చిన్నప్పటి నుండి చేసిన బాడ్మింటన్ ప్రయాణాన్ని చూపించనున్నట్టు ఫస్ట్ గ్లిమ్ప్స్ లో తెలుస్తుంది. టి-సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, సుజయ్ జయరాజ్, రాజేష్ షా ఈ సినిమాని నిర్మించారు. అమోల్ గుప్తే ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మార్చ్ 26 న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular