బాలీవుడ్: ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘సైనా’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెలలోనే విడుదలకి సిద్ధం అవుతుంది. ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని విడుదల చేసింది సినిమా టీం. ఈ సినిమాలో సైనా నెహ్వాల్ పాత్రలో పరిణీతి చోప్రా నటిస్తుంది. టీజర్ ద్వారా సైనా బ్యాండ్మింటన్ జర్నీ మొత్తం చూపించనున్నట్టు హింట్ ఇచ్చారు. సైనా తన చిన్న తనం నుండి ఒలింపిక్ విన్నర్ అయ్యే వరకు తన ప్రయాణాన్ని చూపించబోతున్నారు.
ఇండియా నుండి బాడ్మింటన్ లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలుచుకున్న మొదటి ప్లేయర్, ఇండియా నుండి బాడ్మింటన్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం పొందిన మహిళ, కామన్ వెల్త్ గేమ్స్ లో ఆరు మెడల్స్ సాధించిన ఘనత ఉన్న ప్లేయర్ సైనా నెహ్వాల్ అంటూ సైనా గురించి టీజర్ లో ప్రెసెంట్ చేసారు. సైనా లుక్స్ పరిణీతి లో తీసుకు రావడానికి ప్రయత్నించారు కానీ అంతగా వర్కౌట్ అవలేదు అనిపిస్తుంది. ఈ నెల చివర్లో మార్చ్ 26 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవనుంది.