కోలీవుడ్: తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం నటించి విడుదలకి సిద్ధం గా ఉన్న సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. నవంబర్ 12 న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ లో విడుదల అవబోతోంది ఈ సినిమా. విక్టరీ వెంకటేష్ తో గురు సినిమా చేసిన ‘సుధా కొంగర‘ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు ‘కెప్టెన్ గోపినాథ్’ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. సూర్య కి జోడీ గా అపర్ణ బాలమురళి నటించింది. ఒక నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాపైన అంచనాలు చాలానే ఉన్నాయి. అందులోనూ ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి ఒక విమానయాన కంపెనీ ప్రారంభించిన ప్రయాణం అంటే చాలానే ఒడి దొడుకులని ఎదుర్కోనుంటాడు. ట్రైలర్ లో కూడా చాలా వరకి అవి చూపించారు.
జి వీ ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇప్పటి వరకి విడుదలైన ఈ సినిమా పాటలు ఆకట్టుకున్నాయి. ఇపుడు ‘సఖియా’ అనే ఒక సాడ్ సాంగ్ విడుదల చేసారు మేకర్స్. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి తెలుగులో సాహిత్యం అందించారు. డబ్బింగ్ పాటే అయిన కూడా లిరిక్స్ బానే కుదిరాయి. ఈ పాటని కూడా జి వీ ప్రకాష్ ఆలపించారు. ఈ సినిమలో హీరో కి తెలుగులో ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ ఫేమ్ సత్యదేవ్ డబ్బింగ్ అందించనున్నారు. ఈ సినిమాని 2D ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య స్వయంగా నిర్మించారు. అక్టోబర్ 23 నే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని అధికారిక అనుమతుల వల్ల ఆగి మరో రెండు రోజుల్లో విడుదల అవబోతుంది.