మూవీడెస్క్:యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా సూపర్ హిట్ కావడంతో, సలార్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే సీక్వెల్ ప్రకటన వచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్డేట్లు లేకపోవడంతో, అభిమానుల్లో కొంత అసంతృప్తి నెలకొంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.
మొదటి భాగం కేవలం 700 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేయగలిగింది. ఇక సలార్ 2పై మరింత అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా 1000 కోట్ల పైగా బిజినెస్ చేసే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, సినిమాపై పూర్తి స్థాయి క్లారిటీ లేకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది.
ప్రభాస్ ప్రస్తుతం “ది రాజాసాబ్” షూటింగ్ లో పాల్గొంటున్నారు. అలాగే హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ వంటి ప్రముఖ దర్శకుల సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు.
ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యేంతవరకు సలార్ 2ను మొదలు పెట్టే అవకాశాలు కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే, సలార్ లోని దేవ్ క్యారెక్టర్ లోని లుక్ కారణంగా సీక్వెల్ ఆలస్యం అవుతుందా? లేక వేరే కారణాలు ఉన్నాయా అనేది ప్రశాంత్ నీల్ అధికారికంగా వెల్లడిస్తే గాని క్లారిటీ రాదు.