fbpx
Tuesday, December 24, 2024
HomeNationalసల్మాన్‌ ఖాన్‌కు మళ్లీ బెదిరింపు!

సల్మాన్‌ ఖాన్‌కు మళ్లీ బెదిరింపు!

Salman Khan gets death threat again

జాతీయం: సల్మాన్‌ ఖాన్‌కు మళ్లీ బెదిరింపు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మళ్లీ ప్రాణహాని బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ముంబయి ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ రావడంతో ఒక్కసారిగా హైఅలర్ట్ ప్రకటించారు. సల్మాన్‌కు రూ.2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరించిన ఈ సందేశం ముంబయి పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఘటన నేపథ్యం – బెదిరింపుల వరుస
ఇటీవల అరెస్టైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వ్యక్తి గుఫ్రాన్ ఖాన్‌పై కేసు నమోదు చేసి నోయిడా నుండి అతడిని అరెస్టు చేసిన కాసేపటికే సల్మాన్ ఖాన్‌కి మరోసారి ప్రాణహాని బెదిరింపు రావడం గమనార్హం. ఈ బెదిరింపులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో హత్యకు గురైన ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ అంశం నేపథ్యంలో సల్మాన్ ఖాన్ విషయంలో కూడా తీవ్ర హెచ్చరికలు రావడం కలకలం రేపుతోంది.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు – గతం నుంచి కొనసాగుతున్న హెచ్చరికలు
కృష్ణజింక వేట కారణంగా సల్మాన్ ఖాన్‌పై పగతో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే పలు మార్లు బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. 2023 నవంబర్‌లో “మరణానికి వీసా అవసరం లేదు” అంటూ సల్మాన్​ను హెచ్చరించారు. సల్మాన్ ఖాన్ తమ మందిరానికి వెళ్లి క్షమాపణలు చెప్పితే తప్ప వదలమని బిష్ణోయ్ గ్యాంగ్ స్పష్టం చేసింది.

విస్తృతమైన దర్యాప్తు – పోలీసుల అప్రమత్తం
సల్మాన్ ఖాన్‌కు ఆగంతుకులు రెగ్యులర్‌గా బెదిరింపులు పంపుతుండడంతో పోలీసులు మరోసారి దర్యాప్తును వేగవంతం చేశారు. ఇటీవలే ఎన్​సీపీ నేత, సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసింది. అలాగే సల్మాన్​కు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండాలని పలువురికి బెదిరింపు సందేశాలు పంపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular