సల్మాన్ ‘సికందర్’ ఫెయిల్యూర్‌కి బాలీవుడ్ షాక్!
2025లో బాలీవుడ్ మరోసారి నిరాశపరిచింది. సల్మాన్ ఖాన్ రష్మిక మందన్నా లాంటి స్టార్ కాంబినేషన్‌తో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సికందర్ చిత్రం అంచనాలకు తగిన ఫలితం ఇవ్వకపోవడంతో ఇండస్ట్రీలో టెన్షన్ మొదలైంది.
ఈ ఏడాది ఇప్పటి వరకు బాలీవుడ్‌కు కేవలం రెండు బ్లాక్‌బస్టర్లే దక్కాయి. సికందర్ ఫెయిల్యూర్ తర్వాత జాట్, వార్ 2, హౌస్‌ఫుల్ 5 లాంటి సినిమాల మీదే ఆశలు మిగిలాయి.
ఒరామాక్స్ రిపోర్ట్ ప్రకారం 2024లో బాలీవుడ్ కలెక్షన్లు రూ.4,679 కోట్లు కాగా, 2023లో ఇది రూ.5,380 కోట్లు. కోవిడ్‌కు ముందు 2019లో రూ.4,831 కోట్లు వసూలవ్వగా, ఇప్పటికీ పూర్తి పునరుద్ధరణ జరగలేదన్నది స్పష్టమవుతోంది.
ఇక హిందీ మార్కెట్‌లో సౌత్ డబ్బింగ్ సినిమాలే ఆధిపత్యం చూపుతున్నాయి. పుష్ప 2, కల్కి 2898 AD లాంటి సినిమాలే హై రేంజ్ లో.కలెక్షన్లు సాధించాయి.
ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ చిన్న సినిమాలు బుకింగ్స్ లేక కష్టాల్లో పడుతున్నాయి. పలు థియేటర్లు ఈవెంట్ హాల్స్‌గా మారుతున్నాయి.
మొత్తం మీద సికందర్ పరాజయం బాలీవుడ్‌కు తీవ్ర హెచ్చరిక. రాబోయే సినిమాల ఫలితాలే పరిశ్రమ దిశను నిర్ణయించనున్నాయి.