బాలీవుడ్: ప్రతి సంవత్సరం రంజాన్ కి తన సినిమా విడుదల చేయడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాడు సల్మాన్ ఖాన్. అలాగే పోయిన సంవత్సరం ‘రాధే’ సినిమాని ప్లాన్ చేసాడు. కానీ కరోనా కారణంగా అపుడు విడుదల అవలేదు. ఇపుడు పరిస్థితులు మెరుగు పడడం తో, థియేటర్లు తెరుచుకోవడం తో ఈ సినిమాని ఈ సంవత్సరం రంజాన్ సందర్భంగా విడుదల చేయనున్నట్టు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రకటించారు. కానీ సెకండ్ వేవ్ కారణంగా మరోసారి థియేటర్లు మూత పడే పరిస్థితి కనపడుతుండడం తో చాలా మంది సినిమాలని వాయిదా వేస్తున్నారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఈ ఈద్ సందర్భంగా తన సినిమాని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధం అయ్యాడు.
ఈ సినిమాని ఈద్ సందర్భంగా ఈ సంవత్సరం మే 13 న విడుదల చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాని థియేటర్లలో మరియు ఓటీటీ లలో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఓటీటీ లో డైరెక్ట్ గా కాకుండా పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాని జీ -ప్లెక్స్ ఓటీటీ లో విడుదల చేయనున్నారు . సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాని ‘భాయ్ కా కంమిట్మెంట్ ఈద్ పే ఎంటర్టైన్మెంట్’ అని ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 13 న విడుదల అవనుంది.