fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsసల్మాన్ 'రాధే' టైటిల్ ట్రాక్ విడుదల

సల్మాన్ ‘రాధే’ టైటిల్ ట్రాక్ విడుదల

SalmanKhan RadheMovie TitleTrackReleased

బాలీవుడ్: బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన సినిమా ‘రాధే’. పోయిన సంవత్సరం ఈద్ కి విడుదలవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సంవత్సరం ఈద్ కి విడుదల చేస్తాం అని ముందుగా ప్రకటించాడు. అయితే ఈ సారి సెకండ్ వేవ్ కారణంగా విడుదలకి పరిస్థితులు అనుకూలించకపోవడం తో ఈ సారి థియేటర్లతో పాటు ఓటీటీ లో కూడా డైరెక్ట్ విడుదల చేస్తున్నారు. కానీ డైరెక్ట్ ఓటీటీ లో కాకుండా పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేస్తున్నారు. జీ సినీ ప్లేస్ ఓటీటీ లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

ఈద్ సందర్భంగా మే 13 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవనుంది. ఈ సినిమా నుండి ‘రాధే’ టైటిల్ ట్రాక్ ఈ రోజు విడుదలైంది. సల్మాన్ ఖాన్ తనదైన స్టెప్పులతో ఈ పాటలో అలరించాడు. సాజిద్ వాజిద్ సంగీతం లో ఈ పాట రూపొందింది. ఈ పాటని సాజిద్ ఆలపించడం మాత్రమే కాకుండా సాహిత్యం కూడా అందించారు. ఇదివరకే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మరియు దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన ‘సీటీ మార్’ బాగా ట్రెండ్ అయ్యాయి. ఈ సినిమాలో సల్మాన్ కి జోడీ గా దిశా పటాని నటించింది. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular