మూవీడెస్క్: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ వైపు మళ్లింది. అక్కడ ఆమె ప్రధానంగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కథలతో వెబ్ సిరీస్‌లలో కనిపిస్తుంటోంది.
తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్: హాన్నీ బన్నీ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది.
సిరీస్ నుంచి విడుదలైన తాజా ట్రైలర్‌లో సమంత పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆకట్టుకుంటోంది.
ఈ యాక్షన్ షాట్స్ చూసిన అభిమానులు ఆమెను “ఇండియన్ లేడీ యాక్షన్ స్టార్”గా అభివర్ణిస్తున్నారు.
ఇప్పట్లో సమంత స్పీడ్ తగ్గేలా లేదని కామెంట్స్ వస్తున్నాయి. బాలీవుడ్‌లో సిటాడెల్ రాబోతుండగా, సమంత మరో వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది.
ఈ సిరీస్ పేరు రక్త్ బ్రహ్మాండ్, ఇది హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ కలిగిన ఫిక్షనల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందట.
ఇందులో సమంత యువరాణి పాత్రలో కనిపించబోతోంది.
తుంబాడ్ ఫేమ్ రాహి అనిల్ బార్వే ఈ సిరీస్‌ని డైరెక్ట్ చేస్తున్నారు, ఇందులో సమంత పాత్ర పవర్ఫుల్‌గా ఉండనుందని టాక్.
సిటాడెల్ సక్సెస్ అయితే సమంత క్రేజ్ మరింత పెరుగుతుందని, అది రక్త్ బ్రహ్మాండ్ కు కూడా హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు.
ఈ తరహా ప్రాజెక్ట్స్ సక్సెస్ అయితే డిజిటల్ స్పేస్ లో సమంత యాక్షన్ సిరీస్‌లకు కేరాఫ్‌గా మారే అవకాశం ఉంది.