స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. వ్యక్తిగతమైన శాంతి, హెల్త్, సెల్ఫ్ లవ్‌కి ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్రాండ్ ఎండార్స్మెంట్స్‌పై చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి.
“ఇప్పటివరకు నేను 15 బ్రాండ్స్‌ను వదులుకున్నా” అని చెప్పిన సామ్, కోట్ల రూపాయల ఆఫర్లున్నా అవి సమాజానికి హానికరమైతే తీసుకోనని స్పష్టం చేశారు. గతంలో తనకు విజయాన్ని బ్రాండ్ కౌంట్లతో కొలిచేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు బాధ్యతతో ఉన్న బ్రాండ్స్‌నే ప్రమోట్ చేస్తానని తెలిపారు.
ఆఫర్ వచ్చిన బ్రాండ్ గురించి ముందుగా తెలుసుకుంటానని, ముగ్గురు వైద్యుల సలహా తీసుకుంటానని పేర్కొన్నారు. వాటి వల్ల ప్రజారోగ్యంపై ప్రభావం ఉండదని ధ్రువీకరించాకే ముందుకు వెళ్లే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
ఇలాంటి ధైర్యమైన నిర్ణయాలు సెలబ్రిటీగా సమంత వ్యక్తిత్వాన్ని మరింత ప్రతిభావంతంగా చూపిస్తున్నాయి. ఆమె తాజా స్టాండ్ అభిమానుల నుంచి ప్రశంసలు పొందుతోంది.