మూవీడెస్క్: టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంతకు గాయం అని వార్తలు వస్తున్నాయి. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొంత కాలం పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న సమంత, విదేశాల్లో విశ్రాంతి తీసుకుని తిరిగి ఇండియాకు వచ్చారు.
ఆమె ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ప్రారంభించి, తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సమంత నీడిల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ, “గాయాల్లేకుండా యాక్షన్ స్టార్‌గా మారగలనా?” అని క్యాప్షన్ ఇచ్చారు.
దీనితో ఆమె యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ సమయంలో గాయపడినట్లు అనిపిస్తోంది. అయితే ఏ చిత్ర షూటింగ్‌లో గాయపడ్డారో ఇప్పటివరకు వివరాలు వెల్లడి కాలేదు.
సమంత అభిమానులు ఈ గాయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంతకు మరో గాయం అవడం చాలా బాధాకరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే, సమంత త్వరలో విడుదల కానున్న “సిటాడెల్” వెబ్ సిరీస్‌లో కూడా యాక్షన్ సీన్స్ చేసినట్లు సమాచారం.