మూవీడెస్క్: సమంత ఒక ఐదేళ్ళ క్రితం వరకు తెలుగు, తమిళ చిత్రసీమలో సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది.
అయితే ఇటీవల ఆమె సినిమాలు అంతగా సక్సెస్ కావడం లేదు. ఇక ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె స్వచ్ఛందంగా బ్రేక్ తీసుకుంది,
ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత కోసం కొంతకాలం విరామం ఇచ్చింది. ప్రస్తుతం కొత్త కథలు వింటూ, బాలీవుడ్‌లో కొన్ని ప్రాజెక్ట్స్‌లో భాగమయ్యే అవకాశాలను పరిశీలిస్తోందని టాక్.
అలాగే, కొన్ని వెబ్ సిరీస్‌లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా, సమంత తన స్వంత ప్రొడక్షన్ హౌస్ ‘ట్రాలల మూవింగ్ పిక్చర్స్’ ప్రారంభించింది.
ఈ బ్యానర్ కింద మొదటి చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీని ప్రకటించింది. ఇందులో సమంత ప్రధాన పాత్రలో కనిపించనుంది.
ప్రొడక్షన్‌లో ఇతర నటీనటులతో కూడా సినిమాలు చేయాలని ఆమె భావిస్తోందని సమాచారం. నటిగా కొనసాగుతూ, ఫుల్ టైమ్ ప్రొడ్యూసర్‌గా మారాలని ఆమె నిర్ణయించుకుంది.
ప్రియదర్శి హీరోగా ఆమె ప్రొడక్షన్‌లో రెండో సినిమా ప్రారంభమయ్యే అవకాశముందని టాక్. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ సినిమాలు నిర్మించాలని సమంత ప్లాన్ చేస్తోంది.
ఇటీవల సమంత ‘జిగ్రా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తిరిగి తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు హింట్ ఇచ్చింది. మరి నిర్మాతగా ఆమె ప్రయాణం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.