మూవీడెస్క్: సమంత ఇటీవల సిటడెల్ సిరీస్ తో మళ్లీ ప్రేక్షకులను ఆకర్షించారు. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో వచ్చిన ఈ సిరీస్ లో యాక్షన్ సీక్వెన్సుల్లో అదరగొట్టారు సామ్.
తన ప్రతిభని మరోసారి ప్రూవ్ చేస్తూ, అభిమానులను అలరించారు.
ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటూ, వరుస ఇంటర్వ్యూలలో ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సమంత మాట్లాడుతూ, సినిమాల్లో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావిస్తున్నానని చెప్పారు.
ఒక యాక్ట్రెస్ గా మహిళలకు సమానంగా గౌరవం వచ్చేలా మంచి పాత్రలను ఎంచుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేవలం రెండు, మూడు సీన్స్ లో కనిపించే పాత్రలను అస్సలు చేయదలుచుకోనని, తాను చేసే ప్రతీ ప్రాజెక్టులో మహిళా పాత్రలు బలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
తనకు వచ్చిన ప్రతి రోల్ పై సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
సిటడెల్ సీరిస్ లో యాక్షన్ సీన్స్ లో హీరోతో సమానంగా కష్టపడటం సవాలుగా అనిపించిందని, అలాంటి రోల్ అరుదుగా వస్తాయని చెప్పారు.
సినిమా ప్రాజెక్ట్స్ కంటే విలువైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళ్లడం తన లక్ష్యమని సమంత స్పష్టంచేశారు.