అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏపీకి ఇవాళ కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ బాధ్యతలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ ఇవాళ నూతన సీఎస్ గా నియమితులైన సమీర్ శర్మకు తన కార్యాలయంలో బాధ్యతలను అప్పగించారు.
కాగా ఏపీకి తొమ్మిది నెలల పాటు ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా బాధ్యతలను చేపట్టారు. ఏపీ నూతన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమీర్ శర్మ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల అమలు కోసం కృషి చేస్తానని, తనపై ఎంతో నమ్మకంతో సీఎస్‌గా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జనగ్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు, అందరి సహకారంతో పని చేస్తాను అని ఆయన అన్నారు.