హైదరాబాద్: ‘ఓ బేబీ’ సినిమాలో వచ్చే ‘నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు’ డైలాగ్ ఈ మధ్య సమంత రెగ్యులర్ గా వాడేస్తుంది. మొన్న బిగ్ బాస్ లో మామయ్య నాగార్జున గారి ప్లేస్ లో ఒక్క రోజు హోస్ట్ చేసిన సమంత ఇపుడు ఆహా వారి టాక్ షో తో పూర్తి హోస్ట్ గా మారనుంది. హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సోషల్ వర్కర్ గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ గా చివరకి ఫామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో విలన్ గా కూడా నటించిన సామ్ ఇపుడు హోస్ట్ గా కూడా తన ప్రతిభ చాటనుంది. ఆహా ఓటీటీ వాల్లు ప్రస్తుతం కంటెంట్ పరంగా దూసుకెళ్తున్నారు. సినిమాలు , వెబ్ సిరీస్ లతో పాటు రక రకాల టాక్ షో లను కూడా ప్లాన్ చేసారు.
నవంబర్ 13 న ఈ టాక్ షో కి సంబందించిన మొదటి ఎపిసోడ్ విడుదల అవబోతుంది. మొదటి ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ గెస్ట్ గా రాబోతున్నాడు. ఈ టాక్ షో లో కొన్ని డిస్కషన్స్, కొన్ని ఫన్నీ టాస్క్స్ తో పాటు చారిటీ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబందించిన టీజర్ ఆహా వాల్లు విడుదల చేసారు. సమంత చేయబోతున్న ఈ టాక్ షో కి ‘సామ్ జామ్’ అని పేరు పెట్టి రేపటి నుండి స్ట్రీమ్ చేయబోతున్నారు. ఇప్పటివరకు రక రకాల టాక్ షోలు చూసాం కానీ ఈ టాక్ షో కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఈ టాక్ షో లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఆధ్వర్యంలో సాగుతుంది.