మూవీడెస్క్: మలయాళం చిత్రసీమ నుంచి టాలీవుడ్ వరకూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్.
ఆమె కెరీర్ ప్రారంభంలో పాప్ కార్న్ అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ, మలయాళంలో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది.
భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంయుక్త, ఆ సినిమాలో తన పాత్ర చిన్నదైనా, తన నటనతో ఆకట్టుకుంది.
తర్వాత బింబిసారా, విరూపాక్ష వంటి చిత్రాలలో అద్భుతమైన నటన కనబరిచి టాలీవుడ్ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.
అలాగే, కళ్యాణ్ రామ్ తో చేసిన డెవిల్ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ, సంయుక్త తన జోరును ఏమాత్రం తగ్గించుకోలేదు.
ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాల లైన్ అప్ చూస్తే, సౌత్ నుంచి హిందీ వరకూ నెంబర్ 1 బిజి హీరోయిన్ అని చెప్పవచ్చు.
తెలుగులో నిఖిల్ స్వయంభు, శర్వానంద్ తో రొమాంటిక్ డ్రామా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇంకా హిందీలో మహారాగ్ని, మలయాళంలో రామ్, తమిళంలో కూడా ఒక కొత్త సినిమాతో సంయుక్త కనిపించనుంది.
ఈ భామకు ఉన్న సినిమా లైన్ అప్ చూస్తే ఆమె స్టార్ హీరోయిన్‌గా నిలబడటానికి అవసరమైన అవకాశాలు గట్టిగానే అందుకున్నట్లు కనిపిస్తోంది.