మూవీడెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా సంయుక్త మీనన్ దూసుకుపోతున్నారు. 2023లో సార్, విరుపాక్ష వంటి హిట్స్‌తో క్రేజ్ పెంచుకున్న ఆమె తాజాగా ఓ పలు ప్రాజెక్ట్‌లతో ప్యాక్ అయ్యారు.
అయితే, ఇప్పుడు ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంతో ఆమె ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకోనున్నారు. ఈ చిత్రానికి “రాక్షసి” అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు టాక్.
ఈ సినిమాలో సంయుక్త ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మునుపటి పాత్రలతో పోలిస్తే ఈ రోల్ చాలా వైవిధ్యంగా, స్ట్రాంగ్ గా ఉండబోతోంది.
మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ దర్శకుడు యోగి ఈ కథను తెరకెక్కిస్తున్నారట. సంయుక్త నటన, మేకోవర్ ఈ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి.
ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తుండగా, సంయుక్త కూడా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించనున్నారు. హీరోయిన్లకు ఇలాంటి పాత్రలు రావడం చాలా అరుదు.
అందుకే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ‘రాక్షసి’ అనే టైటిల్ సినిమాకు బలం అయినప్పటికీ, దానిపై కొన్ని సందేహాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇప్పటి వరకు మంచి విజయాలటే అందుకున్న సంయుక్త, ఈసారి తన భుజాల మీద సినిమా విజయాన్ని మోసే ప్రయత్నం చేస్తున్నారు.
కొత్త అవతారంలో రాక్షసిగా ఆమె ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో మెప్పిస్తారనేది వేచి చూడాలి. మరి ఈ ప్రయత్నం సంయుక్తకు మరింత గుర్తింపు తీసుకురావాలని అందరూ ఆశిస్తున్నారు.