మూవీడెస్క్: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో నేషనల్ వైడ్‌గా తన ప్రతిభను చూపిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి తెలుగులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
తొలి చిత్రంతోనే టాలీవుడ్‌ని దాటి బాలీవుడ్‌లో తన పేరు నిలబెట్టుకున్నాడు.
ఈ సినిమా సక్సెస్ తర్వాత అనేక అవకాశాలు వచ్చినా, బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ మూవీ చేశాడు. ఈ సినిమా హిట్ తో మరింత గుర్తింపు పొందాడు.
ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్న సందీప్ రెడ్డి గురించి తాజాగా ప్రముఖ రచయిత కోన వెంకట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘అర్జున్ రెడ్డి’ కథతో మొదట ఒక ప్రముఖ హీరో ఆఫీస్‌లో సందీప్ మూడు సంవత్సరాలు తలుపు తట్టాడని, ఆ హీరో టీమ్ అతడికి రోజుకు ఒకే పూట భోజనం పెట్టినట్టు చెప్పాడు.
చివరికి, మూడు సంవత్సరాల తర్వాత ఆ హీరో ఈ ప్రాజెక్ట్ చేయలేనని చెప్పాడట.
ఇక, మరో హీరో దగ్గరకి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా, రెండేళ్ల పాటు ఆ సినిమా కోసం వెయిట్ చేశాడని కోన వెంకట్ తెలిపారు.
కానీ ఆ హీరో కూడా చివరికి ప్రాజెక్ట్ చేయకుండా వెనుకడగెత్తాడు. ఆ సమయంలో అతని అన్నయ్య సపోర్ట్ చేయడంతో ‘అర్జున్ రెడ్డి’ తెరపైకి వచ్చింది.
ఇప్పుడు అందరూ సందీప్ రెడ్డిని మోసం చేసిన హీరోలు ఎవరని చర్చించుకుంటున్నారు. ఈ అవమానాలే అతడిని గొప్ప దర్శకుడిగా మలిచాయని నెటిజన్లు భావిస్తున్నారు.