సందీప్ రెడ్డి వంగా సినిమాలకు మాస్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు, ఆయన స్టైల్‌లో మాస్, ఇంటెన్స్ ఎమోషన్ ఒక రేంజ్ లో క్లిక్కయ్యాయి. అయితే, హీరో డామినేట్ చేసే కథలు తీయడంపై కొంతమంది విమర్శలు చేస్తుంటారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో, హీరో లేకుండా సినిమా తీయగలరా? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘‘నేను హీరో లేకుండా సినిమా తీయాలనుకుంటున్నా. కొన్ని సంవత్సరాల్లో అలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నా. కానీ అప్పటికి ఇదే విమర్శలు మళ్లీ వస్తాయి’’ అంటూ సందీప్ వంగా కామెంట్ చేశారు.
ఇది సరదాగా చెప్పిన మాటా లేకపోతే నిజంగా అటువంటి ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారా? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. సందీప్ వంగా సినిమాలు కమర్షియల్ బౌండరీలను బ్రేక్ చేస్తాయి.
హీరో లేకుండా సినిమా అంటే కచ్చితంగా కొత్త ప్రయోగమే. అయితే, స్పిరిట్ సినిమా తర్వాత ఆయన యానిమల్ 2, అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌తో బిజీ కానున్నారు.
ఇక ఈ ప్రయోగం వంగాకు మరో పెద్ద విజయం తెస్తుందా లేక అభిమానులు మాస్ హీరో స్టోరీలే కోరుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకముందే ఈ వార్త హాట్ టాపిక్ అయింది.