fbpx
Saturday, January 18, 2025
HomeMovie NewsSSMB29 షూటింగ్ లో సందీప్ వంగా హాజరవుతారా?

SSMB29 షూటింగ్ లో సందీప్ వంగా హాజరవుతారా?

SANDEEP-REDDY-VANGA-WITH-RAJAMOULI-FOR-SSMB29
SANDEEP-REDDY-VANGA-WITH-RAJAMOULI-FOR-SSMB29

మూవీడెస్క్: దర్శకుడు రాజమౌళి మహేష్ బాబుతో కలిసి SSMB29 అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా 2025లో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 1000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని టాక్.

ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి టీమ్ క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. 

హాలీవుడ్ నటులు ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతారని వినికిడి. అయితే ఇప్పుడు సినిమా వర్గాల్లో ఒక ఆసక్తికర టాక్ వినిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ ప్రాజెక్ట్ లో రాజమౌళి టీమ్ లో భాగమవుతారా అనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల సమయంలో సందీప్ రెడ్డి, రాజమౌళిని కలుసుకుని మీ తదుపరి ప్రాజెక్ట్ లో సెట్ లో పాల్గొని నేర్చుకునే అవకాశం ఇవ్వండి అని కోరారు.

రాజమౌళి ఈ రిక్వెస్ట్ పై సానుకూలంగా స్పందించారు.

ఇప్పుడు, ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లినప్పుడు సందీప్ రెడ్డి కూడా సెట్ లో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సందీప్ ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

షూటింగ్ టైంలో గ్యాప్ తీసుకుని ఈ ప్రాజెక్ట్ లో రాజమౌళి టీమ్ లో చేరుతారా అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular