మూవీడెస్క్: అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగా మంచి క్రేజ్ అందుకుంటున్నారు.
ఈ సినిమాలు అతని క్రేజ్ ని అమాంతం పెంచేశాయి. యానిమల్ సినిమాకి 900+ కోట్లకి పైగా కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వచ్చాయి.
అతని నుంచి నెక్స్ట్ రాబోయే సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరడం గ్యారెంటీ అనే మాట ట్రెండ్ వర్గాల నుంచి వినిపిస్తోంది.
సందీప్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేయబోతున్నాడు. స్పిరిట్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూవీ కన్ఫర్మ్ అయ్యింది. టి-సిరీస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అయ్యింది.
అయితే ఈ సినిమా ప్రారంభం కావడానికి కనీసం 4 ఏళ్ళకి పైగా సమయం పట్టే ఛాన్స్ ఉందంట.
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాని పూర్తి చేయడానికి రెండేళ్లు పడుతుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. స్పిరిట్ మూవీ కంప్లీట్ అయ్యాక యానిమల్ పార్క్ చేస్తానని చెప్పారు.
రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ కి సీక్వెల్ గా యానిమల్ పార్క్ తెరకెక్కనుంది. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యేసరికి నాలుగేళ్లు పడుతుందట.
వీటి తర్వాతనే అల్లు అర్జున్ తో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.