టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తన ల్యాండ్ మార్క్ సినిమాలో నటిస్తున్నాడు. తన కెరీర్ లో 25 వ సినిమా గా రూపొందుతున్న సినిమాని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నాడు. అన్ని హంగులు పూర్తి చేసుకుని విడుదలకి సిద్దాం గా ఉన్న ఈ సినిమాని ఫిబ్రవరి 26 న విడుదల చేయనున్నట్టు మొదట ప్రకటించారు కానీ ప్రస్తుతం ఈ సినిమాని ఒక వారం రోజులు ఆలస్యంగా మార్చ్ 5 న విడుదల చేయనున్నట్టు తెలిపారు. తెలుగులో హాకీ క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జోడి గా లావణ్య త్రిపాఠి నటిస్తుంది.
ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యాక సినిమా పైన అంచనాలు పెరిగాయి. కేవలం ఒక సింపుల్ లవ్ స్టోరీ, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని గేమ్స్ పెట్టి ఛాంపియన్ లాగా చూపించడం కాకుండా మన దేశం లో ఆటలు ఎలాంటి స్టేజ్ లో ఉన్నాయి, టాలెంట్ ఉన్నా ఎంతో మంది వెనకబడి ఉన్నారు లాంటి అంశాలని టచ్ చేసినట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం కలిసి ఈ సినిమాని నిర్మించారు.డెన్నిస్ జీవన్ కనుకొలను ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. హిప్ హాప్ తమిళ సంగీతంతో ఇప్పటివరకు వచ్చిన పాటలు ఆకట్టుకున్నాయి. మరి కొద్దీ రోజుల్లో విడుదలవబోతున్న ఈ సినిమా పై సందీప్ కిషన్ బాగానే అంచనాలు పెట్టుకున్నాడు.