టాలీవుడ్: సందీప్ కిషన్ తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ సినిమా అయిన 25 వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని భారత దేశ నేషనల్ స్పోర్ట్స్ ‘హాకీ’ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదల చేసారు. హాకీలో ఇండియా మెడల్స్ ఎన్ని సంపాదించింది.. ఆ తర్వాత హాకీ ని నేషనల్ గేమ్ గా ప్రకటించడం తో ట్రైలర్ ఆరంభం అయింది. తర్వాత హీరోయిన్ తో కొంత లవ్ ట్రాక్ లాగా చూపించి సినిమా మెయిన్ కాన్సెప్ట్ దిశగా ట్రైలర్ చూపించారు.
‘ఇంకా హాకీ అంటే షారూఖ్ ఖాన్ కోచ్ అనుకుంటున్నారు’ అనే రావు రమేష్ డైలాగ్ తో ప్రస్తుతం దేశం లో హాకీ పరిస్థితి ని చూపించారు. ‘ఇక్కడ స్పోర్ట్స్ మెన్ కి ఇవ్వాల్సిన కనీస రెస్పెక్ట్ దొరకడం లేదు, స్పోర్ట్స్ బిజినెస్ అయ్యి చాలా కాలం అయింది.. ఏ స్పోర్ట్స్ చూడాలో కూడా బిజినెస్ మెన్ డిసైడ్ చేసే పరిస్థితి వచ్చింది, కొన్ని సార్లు స్పోర్ట్స్ ఆడాలంటే కూడా డబ్బు చెల్లించాల్సి వస్తుంది ‘ లాంటి డైలాగ్స్ తో ప్రసుతం దేశం లో క్రీడల పరిస్థితి ఏంటి, సినిమా ఉదేశ్యం ఏంటి అనేది ట్రైలర్ లో రెండు మాటల్లో చెప్పారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ గా చూపించిన సీన్స్ లో ఆకట్టుకున్నాడు. తన ల్యాండ్ మార్క్ సినిమా కోసం బాగానే కష్టపడినట్టు ట్రైలర్ లో అర్ధం అవుతుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం కలిసి ఈ సినిమాని నిర్మించారు. డెన్నిస్ జీవన్ కనుకొలను ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. హిప్ హాప్ తమిళ ఈ సినిమాకి సంగీతం అందించారు. ధ్రువ తర్వాత ఈ సంగీతం దర్శకుడు తెలుగు సినిమాకి పని చేయడం ఇదే. ఫిబ్రవరి విడుదల చేయబోతున్న ఈ సినిమా పై సందీప్ కిషన్ బాగానే అంచనాలు పెట్టుకున్నాడు. ట్రైలర్ వరకైతే సినిమా అంచనాలు పెంచింది, విడుదల అయ్యాక ఎలా ఉంటుందో మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది.