టాలీవుడ్: వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ కిషన్. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ దొరకనప్పటికీ ఆఫర్లు మాత్రం ఈ హీరోకి ఏ మాత్రం తగ్గలేదు. ఎన్నో ఆశలతో ‘A1 ఎక్ష్ప్రెస్స్’ సినిమాను తన ల్యాండ్ మార్క్ సినిమాగా రూపొందించి విడుదల చేసినా కూడా ఆశించిన ఫలితం రాలేదు. ఇపుడు మరో కామెడీ ఎంటర్టైనర్ తో మన ముందుకు రాబోతున్నాడు. ‘రౌడీ బేబీ’ అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమాని కొన్ని కారణాల వలన పేరు మార్చి ఇపుడు ‘గల్లీ రౌడీ’ అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాని మే 21 న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది సినిమా టీం.
సందీప్ కిషన్ తో ఇదివరకే రామకృష్ణ బి.ఎ.బి.ఎల్ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాని కూడా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో తమిళ నటుడు ‘బాబీ సింహ‘ అలాగే రాజేంద్ర ప్రసాద్ లాంటి మంచి నటులు కూడా ఉన్నారు. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ లా రూపొందుతున్న ఈ సినిమాని కే.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మే 21 న విడుదల చేస్తున్నారు. ఇదేరోజు సత్యదేవ్ నటిస్తున్న తిమ్మరుసు సినిమా కూడా విడుదలవుతుంది.