fbpx
Wednesday, May 7, 2025
HomeMovie Newsగల్లీ రౌడీ: రౌడీయిజంలో నెపోటిజం

గల్లీ రౌడీ: రౌడీయిజంలో నెపోటిజం

SandeepKishan GalleeRowdy TeaserLaunch

టాలీవుడ్: హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న సందీప్ కిషన్ ప్రస్తుతం మరో సినిమాని విడుదలకి రెడీ చేసాడు. ఈ మధ్యనే ‘A1 ఎక్స్ప్రెస్’ అని తన 25 వ ల్యాండ్ మార్క్ సినిమా తన సొంత నిర్మాణంలో రూపొందించిన కూడా ఆశించిన ఫలితం రాలేదు. ప్రస్తుతం ‘గల్లీ రౌడీ’ అనే మరో నాన్-స్టాప్ కామెడీ ఎంటర్టైనర్ ని సిద్ధం చేసాడు. ఈ రోజు ఈ సినిమా టీజర్ ని విజయ్ దేవరకొండ విడుదల చేసారు.

టీజర్ ఆరంభంలో రౌడీ గా తొలి అడుగుల వేస్తున్న సందీప్ కి గల్లీ ప్రజలందరూ బాషా రేంజ్ లో చేతిని ముద్దు పెట్టుకుంటారు. గల్లీ రౌడీ గా ఉండే సందీప్ ఒక అమ్మాయి కోసం ఒక కిడ్నాప్ చేయడం , దాని వాళ్ళ కొత్త చిక్కుల్లో ఇరుక్కోవడం, దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలన్నీ చాలా కామెడీ గా నరేట్ చేస్తినట్టు టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. చివర్లో ‘ఎవరైనా కొడుకుల్ని ఇంజనీర్ చేస్తారు, డాక్టర్ ని చేస్తారు బాగా డబ్బులు ఎక్కువైతే పొలిటీషియన్ చేస్తారు ఈ రౌడీ ని చేయడం ఏంట్రా?’ అని డైలాగ్ చెప్తే దానికి బదులుగా సందీప్ ‘నేపోటిజం’ రా అని చెప్పే డైలాగ్ బాగా పేలింది. వీటితో పాటు వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ఒక ఫుల్ లెంగ్ కారెక్టర్ లో అలరించనున్నట్టు తెలుస్తుంది.

ఎం.వీ.వీ ఆర్ట్స్ బ్యానర్ పై ఎం.వీ.వీ సత్యనారాయణ మరియు కోన వెంకట్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ తో ఇదివరకే తెనాలి రామ కృష్ణ సినిమాని రూపొందించిన జి.నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ కి జోడీ గ నేహా హరిరాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాకుండా తమిళ నటుడు ‘బాబీ సింహ’ ఒక ప్రత్యేక పాత్రలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు .మరిన్ని పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, షకలక శంకర్, వైవా హర్ష , వెన్నల కిషోర్ తడి తరులు నటిస్తున్నారు. మే 21 న ఈ సినిమాని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Gully Rowdy Movie Teaser | Sundeep Kishan | Neha Shetty | Bobby Simha | Latest Telugu Teasers 2021

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular