టాలీవుడ్: ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా అనే పేరు సౌత్ సినిమా ఇండస్ట్రీ లలో వైడ్ గా వినిపిస్తుంది. ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్ పాన్ ఇండియా స్కోప్ లో సినిమాలని, కథలని సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పెద్ద హీరోలతో పాటు చిన్న, మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. తెలుగు నుండి ఇప్పటికే పెద్ద హీరోలతో పాటు విజయ్ దేవరకొండ లాంటి యూత్ హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న మరో యూత్ హీరో ‘సందీప్ కిషన్’ ఒక పాన్ ఇండియా సినిమాతో రానున్నాడు. ఇప్పటికే ఈ హీరో ‘షోర్ ఇన్ ది సిటీ’ అనే హిందీ సినిమాలో మరియు ‘ది ఫామిలీ మాన్’ హిందీ వెబ్ సిరీస్ లో కూడా నటించాడు.
సందీప్ కిషన్ హీరో గా ‘మైఖేల్’ అనే పాన్ ఇండియా సినిమాని ఈ రోజు ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ తో పాటు ఒక పోస్టర్ కూడా విడుదల చేసారు మేకర్స్. సందీప్ చేతికి సంకెళ్లు వేసి ఉండగా మరో చేతిలో ఒక హ్యాండ్ వెపన్ తో ఉన్నాడు. ‘మైఖేల్’ అనగానే ‘యువ’ సినిమాలో సూర్య పోషించిన పాత్ర గుర్తుకు వస్తుంది. ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే కూడా ఇంచు మించు అలాంటి కారెక్టర్ పోలికలున్నట్టు కనిపిస్తుంది. ఈ సినిమాలో ఒక స్పెషలిస్ట్ యాక్షన్ పాత్రలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రంజిత్ జేకోడి అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. లవ్ స్టోరీ సినిమాని రూపొందించిన ఏషియన్ మూవీస్ వారు ఈ సినిమాని నిర్మించనున్నారు.ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ , మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు.