టాలీవుడ్: ఇండస్ట్రీ లో అతి తక్కువ మంది డైరెక్టర్ లు తమ ప్రతి సినిమాకి ఒక కొత్త రకమైన కథతో లేదా కొత్త ప్రయత్నంతో ముందుకు వస్తుంటారు. అభిమానులకి తమ సినిమా చూడగానే ఒక కొత్త అనుభూతి కలగాలని తాపత్రయం పడుతూ ఉంటారు. అలాంటి దర్శకుల్లో వి.ఐ.ఆనంద్ ఒకరు. నిఖిల్ హీరోగా రూపొందిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో సూపర్ సక్సెస్ చూసిన ఈ డైరెక్టర్ అంతక ముందే మూడు సినిమాలు డైరెక్ట్ చేసాడు. తెలుగు లో సందీప్ కిషన్ తో ‘టైగర్’ అనే సినిమాతో పరిచయం అయిన ఈ డైరెక్టర్ సందీప్ కిషన్ తో మరో సినిమాని సిద్ధం చేస్తున్నాడు.
ఈ రోజు సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన ప్రకటన చేసారు. సందీప్ కిషన్, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్ లో ఒక సూపర్ నాచురల్ ఫాంటసీ సినిమా రూపొదిద్దుకోబోతున్నట్టు ప్రకటించారు. ‘ఒక్క క్షణం’, ‘డిస్కో రాజా’ లాంటి సినిమాల ద్వారా ఫెయిల్యూర్స్ చూసిన వి.ఐ.ఆనంద్ ఈ సినిమా ద్వారా మరో కొత్త ప్రయత్నం తో హిట్ సాధించాలని చూస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 28 వ సినిమా గా ఈ సినిమా రూపొందనుంది. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడగానే ఈ సినిమా మొదలుపెట్టనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.