బాలీవుడ్: ‘అర్జున్ రెడ్డి’ అనే ఒక్క సినిమా తో టాప్ లీగ్ డైరెక్టర్ జాబితాలో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా అయిన వెంటనే టాలీవుడ్ లో కూడా ఎవ్వరికీ చిక్కకుండా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో హిందీ లో అర్జున్ రెడ్డి సినిమాని రీమేక్ చేసి అక్కడ కూడా సినిమాని సూపర్ హిట్ చేసాడు. అయితే చరణ్ తో సినిమా అని మహేష్ తో సినిమా అని రకరకాల వార్తలు వినిపించినప్పటికీ ఏ రకమైన అధికారిక ప్రకటన రాలేదు.ఈ విషయం లో రణ్ బీర్ తో చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి కానీ అధికారికంగా ఎవరూ ఐతే ప్రకటించలేదు. రణ్ బీర్ కపూర్ మాత్రం తన తరువాతి సినిమాని సందీప్ రెడ్డి వంగా తో చేయనున్నట్టు ఒక ఇంటర్వ్యూ లో రణ్ బీర్ కపూర్ తెలియచేసారు.
రణ్ బీర్ కపూర్ ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చారు. తాను ప్రేమించిన అమ్మాయి ‘అలియా భట్’ ని 2021 లో పెళ్లి చేసుకోనున్నట్టు చెప్పారు. తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో సందీప్ రెడ్డి వంగా తో ఒక సినిమా చేయబోతున్నానని 2021 ద్వేతీయార్థం లో ఈ సినిమా మొదలవుతుందని ఆశాభావం తెలియచేసారు. ఈ సినిమాని ‘ఆనిమల్’ అంటే జంతువు అనే టైటిల్ తో రూపొండుస్తున్నటు వార్తలు వస్తున్నాయి. వరుసగా పెద్ద అవకాశాలు చేజిక్కించుకుంటున్న సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ అవ్వాలని ఆశిద్దాం .