శాండల్ వుడ్: బాహుబలి , ఆర్ ఆర్ ఆర్ కోసం సినీ అభిమానులు ఎంత ఎదురుచూస్తున్నారో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నారు అనడం లో సందేహం లేదు. 2018 లో ఎలాంటి అంచలాను లేకుండా విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో అద్భుతమైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో 2018 లో వచ్చిన ఈ సినిమాకి కొనసాగింపుగా KGF పార్ట్ 2 ప్రస్తుతం సిద్ధం అవుతుంది. యష్ హీరో గా నటిస్తున్న ఈ సినిమా రెండవ భాగంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదివరకే అతని క్యారెక్టర్ పేరు అధీరా గా అనౌన్స్ చేసారు ఈ సినిమా టీం. బాహుబలి తర్వాత బాలీవుడ్ లో సత్తా చాటిన సౌత్ సినిమాగా ఈ సినిమాకి పేరుంది. అంతే కాకుండా ఈ సినిమాలో రవీనా టాండన్ లాంటి బాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ అధీరా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.. ‘అధీరా’ – వైకింగ్స్ యొక్క క్రూరమైన మార్గాల నుండి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో నటిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్ డే సంజయ్ బాబా. త్వరలో స్టార్ట్ అవబోయే క్రేజీ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాము అని ట్వీట్ చేసారు. కె.జి.ఎఫ్ మొదటి పార్ట్ లో అధీరా కి సీన్స్ ఉన్నప్పటికీ ఆ పాత్ర ని బయటపెట్టలేదు. కానీ కె.జి.ఎఫ్ 2 లో సంజయ్ దత్ ని మెయిన్ విలన్ గా చూపిస్తున్నారు. ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని హెంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.