టాలీవుడ్: ‘ఓ పిట్ట కథ’ సినిమా ద్వారా ‘సంజయ్ రావు’ అనే హీరో పరిచయం అయ్యాడు. సంజయ్ రావు ఎవరో కాదు, సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు. సంజయ్ రావు మొదటి సినిమా ‘ఓ పిట్ట కథ’ లో పరవాలేదనిపించాడు. లుక్స్ పరంగా అంతగా ఆకట్టుకోనప్పటికీ యాక్టింగ్ లో ఈజ్ చూపించి ఆకట్టుకున్నాడు. నిన్న సంజయ్ రావు పుట్టిన రోజు సందర్భంగా సంజయ్ ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలు టైటిల్స్ మరియు ఫస్ట్ లుక్స్ ప్రకటించి ఆశ్చర్య పరచాడు.
‘గుట్టు చప్పుడు’ అనే ఒక సినిమాలో సంజయ్ రావు నటిస్తున్నాడు. ఈ సినిమాలో సంజయ్ లుక్ ఒక పూర్తి మాస్ అప్పియరెన్స్ తో కనిపిస్తుంది. బేర్ బాడీ తో లుంగీ కట్టుకుని బీడీ కాల్చుతూ ఉన్న లుక్ విడుదల చేసింది సినిమా టీం. డాన్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో లివింగ్ స్టన్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మనింద్రన్ అనే దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇదే కాకుండా ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అనే మరో సినిమాని కూడా ప్రకటించాడు సంజయ్. తన మొదటి సినిమాలో హీరోయిన్ గా నటించిన నిత్యా శెట్టి ఈ సినిమాలో మరోసారి సంజయ్ తో జతకట్టింది. ఈ సినిమాలో ఒక క్లాస్ రోల్ లో కనిపించనున్నట్టు ఫస్ట్ లుక్ చూస్తే అర్ధం అవుతుంది. రోమ్ కామ్ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాని మెలూహ మీడియా లిమిటెడ్ బ్యానర్ పై సస్వతి రాయ్ నిర్మిస్తున్నారు. అశోక్ బాబు ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు.