అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంజీవిని బస్సులు నిజంగానే సంజీవిని లాగే పని చేస్తున్నాయి. రోజుకు వేల సంఖ్యలో పరీక్షలు చేస్తూ అత్యంత త్వరగా ఫలితాలు ఇస్తున్నాయి.
ఆర్టీసీ బస్సులలో వైద్య సదుపాయాలు కల్పించి రోజుకు దాదాపు 2000 పరీక్షలు నిర్వహించేలా ఏర్పాటు చేసారు. దీంతో 5 నిమిషాలలో పరీక్షలు నిర్వహించి, 10 నిమిషాలలో ఫలితాలు ఇస్తున్నారు. ర్యాపిడ్ యాంటీ టెస్ట్ కిట్‌లను బస్సుల ద్వారా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురావడంతో పాజిటివ్ కేసులు వందల సంఖ్యలో బయటపడుతున్నాయి.
అయితే ఒకేసారి ఇన్ని కేసులు బయటపడుతుండగా అందరికీ వైద్యం అందించడం కాస్త కష్టంగానే ఉన్నా కేసులు అన్ని త్వరితగతిన బయట పడితే స్ధారన జీవితంలోకి వెళ్ళే అవకాశం ఉంది.
ఆర్టిసీ బస్సులలో టెస్టులు చేసే సౌకర్యం కల్పించారు. ప్రతి బస్సు అద్దాలలో పది కౌంటర్లు ఏర్పాటు చేసి ఒక చేయి పట్టేంత రంధ్రం ఏర్పాటు చేశారు. ఆ అద్దాల దగ్గరకు టెస్టు చేయించుకోవాలనుకునే వారికి ర్యాంపు ఏర్పాటు చేసి కౌంటరు దగ్గర నిలబడే ఏర్పాటు చేసారు. ఒక్కొక్క కౌంటరు దగ్గర ఒక డాక్టర్, ఇక టెక్నీషియన్ ఉంటారు.
బస్సు రంధ్రం ద్వారా ముక్కులో పరికరాన్ని ఉంచి శాంపిల్ తీసుకుని పది నిమిషాల్లొ పరీక్షించ్ ఫలితాలను ఇచ్చే యాంటి ర్యాపిడ్ జెన్ కిట్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కొక్క బస్సు ద్వారా ఎక్కువ పరీక్షలు చేస్తున్నారు. కేసులు ఎక్కువగా బయట పడడం వలన పరీక్షలు రెండు రోజులు పాటు నిలిపి వేశారు. పరీక్షలు తిరిగి సోమవారం నుంచి మొదలు కాబోతున్నాయి.