టాలీవుడ్: తెలుగు నుండి బాలీవుడ్ వెళ్లిన దర్శకులు ఎవరు అంటే ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే పేరు వినిపించేది. అక్కడ కూడా అయన ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు రూపొందించారు. ఇపుడు తెలుగు సక్సెస్ రేంజ్ పెరగడంతో ఇక్కడి దర్శకులకి కూడా అక్కడి నుండి పిలుపు వస్తుంది. ఈ మధ్యనే అర్జున్ రెడ్డి డైరెక్టర్ షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్, గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాని రూపొందించారు. ప్రస్తుతం వీళ్ళబాటలోనే మరో దర్శకుడు చేరనున్నారు.
మొదటి సినిమా ఘాజి తోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుని నేషనల్ అవార్డు సాధించే సినిమాని రూపొందించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి. రెండవ సినిమాని స్పేస్ జానర్ లో ‘అంతరిక్షం’ సినిమాని వరుణ్ తేజ్ హీరో గా రూపొందించాడు. సినిమా అంతగా ఆకట్టుకోకపోవడం తో దర్శకుడి గురించి మూడు సంవత్సరాలుగా సౌండింగ్ లేదు. ప్రస్తుతం ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ ప్రకటించి ఆశ్చర్యపరచాడు సంకల్ప్ రెడ్డి.
విజయ్ నటించిన ‘తుపాకీ’ సినిమాలో విలన్ గా నటించిన విద్యుత్ జమాల్ బాలీవుడ్ లో హీరో గా రెండు మూడు సినిమాలు రూపొందించాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో విద్యుత్ జమాల్ హీరో గా ‘IB 71 ‘ అనే టైటిల్ తో ఒక సినిమా రూపొందించనున్నట్టు ఈరోజు ప్రకటించారు. విద్యుత్ జమాల్ తన సొంత బ్యానర్ అయిన ‘యాక్షన్ ఫిలిమ్స్’ బ్యానర్ పై, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారితో సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. టైటిల్ తోనే ఎదో ప్రత్యేకత ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో మరో సూపర్ సక్సెస్ సాధించి సంకల్ప్ రెడ్డి కం బ్యాక్ అవ్వాలని ఆశిద్దాం.