మూవీడెస్క్: గేమ్ ఛేంజర్ ట్రైలర్‌తో ప్రేక్షకులలో ఉత్సాహం నింపిన డైరెక్టర్ శంకర్, తన వింటేజ్ టచ్‌కి తిరిగి వచ్చారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ 2లో ఎదురైన ఫ్లాప్ తర్వాత శంకర్‌కు గేమ్ ఛేంజర్ హిట్ ఎంతో కీలకంగా మారింది.
భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఇది విజయం సాధిస్తే శంకర్ ఇండియన్ 3 పనుల్లో నిమగ్నమవుతారు.
అదేవిధంగా, వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న వీరయుగ నాయగన్ వేల్పరి ప్రాజెక్ట్‌పై కూడా దృష్టి పెట్టారు.
మధురై ఎంపీ ఎస్. వెంకటేశన్ రాసిన వేల్పరి నవల ఆధారంగా మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ సిద్ధమవుతోంది.
చారిత్రక నేపథ్యంతో ఈ కథ దృశ్యవిందుగా ఉండబోతోందట. హీరో ఎంపికపై ఇంకా స్పష్టత లేదు.
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ పేరు వినిపించినప్పటికీ, ఆయన లేనిపక్షంలో సౌత్ నుండి ఎవరో రేసులోకి వస్తారని టాక్.
చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో శంకర్ ఈ ప్రాజెక్ట్‌ను ధృవీకరించారు. నిర్మాణ బాధ్యతలు పెన్ స్టూడియోస్ తీసుకునే అవకాశముంది.
గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 సక్సెస్ అయితే వేల్పరి మరింత వేగంగా ప్రారంభమవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
మరి శంకర్ తన అద్భుత విజన్‌తో మరోసారి మెప్పిస్తారేమో చూడాలి.